షెఫాలీ ఫటాఫట్‌‌‌‌.. సెమీస్‌‌‌‌కు ఇండియా

షెఫాలీ ఫటాఫట్‌‌‌‌.. సెమీస్‌‌‌‌కు ఇండియా

డంబుల్లా:  యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ (48 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 81) దంచికొట్టడంతో విమెన్స్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌లో హ్యాట్రిక్ విక్టరీ సాధించిన టీమిండియా సెమీఫైనల్‌‌‌‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ చివరి మ్యాచ్‌‌‌‌లో 82 రన్స్‌‌‌‌ తేడాతో నేపాల్‌‌‌‌ జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 178/3 స్కోరు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్‌‌‌‌‌‌‌‌  ఈ మ్యాచ్‌‌‌‌కు దూరంగా ఉండటంతో కెప్టెన్సీ చేపట్టిన స్మృతి మంధాన బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను మార్చింది. తన ప్లేస్‌‌‌‌లో దయలన్‌‌‌‌ హేమలత (42 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 47)ను ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా దింపింది. అమెతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన షెఫాలీ భారీ షాట్లతో విజృంభించింది. దాంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలోనే 50 రన్స్‌‌‌‌ వచ్చాయి. 

ALSO READ : గ్రౌండ్‌‌‌‌లోకి గంభీర్‌‌‌‌‌‌‌‌

 మరో ఎండ్‌‌‌‌లో హేమలత కూడా సత్తా చాటింది. షెఫాలీ 26 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. 10.3 ఓవర్లలోనే స్కోరు వంద దాటింది. ఫిఫ్టీకి చేరువైన హేమలత14వ ఓవర్లో ఔటవ్వడంతో తొలి వికెట్‌‌‌‌కు 122 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. సెంచరీ చేసేలా కనిపించిన షెఫాలీని కూడా మగార్ పెవిలియన్ చేర్చింది.  సజీవన్ సజన (10) ఫెయిలైనా చివర్లో  జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (15 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 28 నాటౌట్‌‌‌‌) మెరుపులతో ఇండియా భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో నేపాల్‌‌‌‌ ఓవర్లన్నీ ఆడి 96/9 స్కోరు మాత్రమే చేసి ఓడింది. సీతా రాణ మగార్ (18), బిందు రావల్ (17 నాటౌట్‌‌‌‌), రూబిన ఛెత్రి (15) కాసేపు పోరాడారు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. రాధా యాదవ్‌‌‌‌, హైదరాబాదీ అరుంధతి రెడ్డి రెండేసి వికెట్లు తీశారు. షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లోనూ గెలిచిన ఇండియా 6 పాయింట్లతో గ్రూప్‌‌‌‌–ఎలో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో  సెమీస్‌‌‌‌లో అడుగు పెట్టింది. మరోవైపు తమ చివరి పోరులో 10 వికెట్ల తేడాతో యూఏఈని ఓడించిన పాకిస్తాన్ కూడా సెమీస్ చేరింది.       

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 178/3 (షెఫాలీ 81, హేమలత 47, జెమీమా 28*, మగార్ 2/25)
నేపాల్: 20 ఓవర్లలో 96/9 ( బిందు రావల్ 17*, దీప్తి శర్మ 3/13, అరుంధతి 2/28)