- స్టార్టప్‌లకు పైసలే పైసలు
- భారీగా పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు
- కిందటి వారంలో రూ. 5 వేల కోట్లు సేకరించిన 23 స్టార్టప్‌లు
- వారానికి సగటున 267 మిలియన్ డాలర్ల సేకరణ
న్యూఢిల్లీ: స్టార్టప్‌లు పుంజుకుంటున్నాయి. ఫండ్స్ సేకరించడంలో ఇబ్బందిపడ్డ కంపెనీలు, ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు సేకరిస్తున్నాయి. ఈ నెల 23 తో ముగిసిన వారంలో 23 స్టార్టప్‌లు 596 మిలియన్ డాలర్లు( రూ.5 వేల కోట్లు) సేకరించాయి.
వీటిలో గ్రోత్ స్టేజ్‌లో ఉన్న ఆరు స్టార్టప్‌లు, ఎర్లీ స్టేజ్‌లో ఉన్న 15 స్టార్టప్‌లు ఉన్నాయి. అంతకు ముందు వారంలో కనీసం 24 స్టార్టప్ కంపెనీలు 186.62 మిలియన్ డాలర్లను రైజ్ చేయగలిగాయి. వీటిలో మూడు గ్రోత్ స్టేజ్, 19 ఎర్లీ స్టేజ్ డీల్స్ ఉన్నాయి.
ఈ నెల 18–23 మధ్య ఫండ్స్ సేకరించిన స్టార్టప్‌లలో జెప్టో, హెల్త్‌కార్ట్, జోపర్ వంటి స్టార్టప్‌లు ఉన్నాయి. క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో 350 మిలియన్ డాలర్లను సేకరించింది. మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్‌లో ఈ ఫండ్స్ సేకరించింది.
దేశంలో క్విక్‌కామర్స్ ఇండస్ట్రీస్ వేగంగా విస్తరిస్తుండడంతో జెప్టోకి పెద్ద మొత్తంలో ఫండ్స్ అందుతున్నాయి. గత ఐదు నెలల్లో 1.3 బిలియన్ డాలర్లను ఈ స్టార్టప్ కంపెనీ సేకరించగలిగింది. ఓమ్నీ చానల్ నూట్రిషన్ ప్లాట్‌ఫామ్ హెల్త్‌కార్ట్ నవంబర్ 23 తో ముగిసిన వారంలో 153 మిలియన్ డాలర్లను సేకరించింది.
క్రిస్‌క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఆల్టర్నేట్స్ ఈ ఫండింగ్ రౌండ్‌ను ముందుండి నడిపాయి. ఇప్పటికే ఈ స్టార్టప్ కంపెనీలో షేరుహోల్డర్‌గా ఉన్న నియో గ్రూప్‌తో పాటు ఏ91 పార్టనర్స్ కూడా ఇన్వెస్ట్ చేశాయి. అంతేకాకుండా హెల్త్‌కార్ట్ తన మొదటి ఈసాప్ బైబ్యాక్ ప్లాన్‌ను ప్రకటించింది. దీని సైజ్ రూ.55 కోట్లు(6.5 మిలియన్ డాలర్లు).
బెంగళూరే టాప్
ఇన్సూరెన్స్ టెక్ ప్లాట్‌ఫామ్ జోపర్ సిరీస్ డీ ఫండింగ్ రౌండ్‌లో 25 మిలియన్ డాలర్లను రైజ్ చేయగలిగింది. ఈ ఫండింగ్ రౌండ్ ఎలివేషన్ క్యాపిటల్, ధరణ క్యాపిటల్ నేతృత్వంలో జరిగింది. ఇప్పటికే షేర్‌హోల్డర్లుగా ఉన్న బ్లూమె వెంచర్స్ కూడా తాజా రౌండ్‌లో ఇన్వెస్ట్ చేసింది.
జొపర్‌లో క్రిజీస్, బేసెమర్ వెంచర్స్ పార్టనర్స్, ఐసీఐసీఐ వెంచర్‌కు కూడా వాటాలు ఉన్నాయి. డెయిరీ సెక్టార్‌లోని స్టార్టప్ కంపెనీ దూద్‌వాలే ఫార్మ్స్ కూడా నవంబర్ 23 తో ముగిసిన వారంలో డబ్బులు సేకరించింది. అటామిక్ క్యాపిటల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్‌లో 3 మిలియన్ డాలర్లు రైజ్ చేసింది.
సింగ్యులారిటీ ఎర్లీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా ఇన్వెస్టర్‌గా జాయిన్ అయ్యింది. ఈ వారం ఫండ్స్ సేకరించిన స్టార్టప్‌లలో ఎక్కువ బెంగళూరు నుంచే ఉన్నాయి. మొత్తం 10 డీల్స్ జరిగాయి. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, పూణె ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
గత ఎనిమిది వారాలను పరిగణనలోకి తీసుకుంటే వారానికి సగటున 266.77 మిలియన్ డాలర్లను స్టార్టప్‌లు సేకరించాయి. సగటున 25 డీల్స్ పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరి– అక్టోబర్ మధ్య ఇండియన్ స్టార్టప్‌లు సుమారు 10 బిలియన్ డాలర్లు సేకరించాయి. కిందటేడాది మొత్తంలో స్టార్టప్‌లు సేకరించిన 10.5 బిలియన్ డాలర్ల మార్క్‌ను త్వరలో అధిగమించే అవకాశం ఉంది.