- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
బెనోని: వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న యంగ్ ఇండియా అండర్19 వరల్డ్ కప్‌లో అసలైన సవాల్‌కు రెడీ అయింది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనుంది. గ్రూప్, సూపర్ సిక్స్ దశల్లో అజేయంగా నిలిచిన ఇండియా అదే జోరుతో ఆతిథ్య సఫారీ టీమ్ పని పట్టి ఫైనల్ చేరుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇండియా ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో సత్తా చాటుతోంది. బ్యాటింగ్‌లో ముషీర్ ఖాన్ రెండు సెంచరీలు, ఓ ఫిఫ్టీతో 334 రన్స్‌తో టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ 304 రన్స్ చేయగా.. సచిన్ దాస్ నేపాల్‌తో గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. బౌలింగ్‌లోనూ వైస్ కెప్టెన్. లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌమీ కుమార్ పాండే 16 వికెట్లతో ఫామ్‌లో మీదున్నాడు. వీళ్లు ఇదే జోరు కొనసాగిస్తే ఇండియా ఫైనల్ చేరడం పెద్ద కష్టమేం కాబోదు. మరో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ పోటీ పడనుంది.