
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు పూర్తి చెడిపోయాయి. ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ మండిపడుతోంది. ప్రతికారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే పాకిస్తాన్ దౌత్య సంబంధాలు తెంచుకుంది. పాక్ దేశీయులు ఇండియా విడిచి వెళ్లాలని వీసాలు రద్దు చేసింది. సింధుజలాలపై ఆంక్షలు విధించింది. అన్ని రకాల ట్రేడింగ్స్ ను రద్దు చేసుకుంది. భారత్ నిర్ణయంతో పాకిస్తాన్ కూడా అన్ని రకాల ట్రేడింగ్స్ రద్దు చేసుకుంది. పాక్ లో ఉన్న భారతీయులను ఇండియాకు వెళ్లిపోవాలని చెప్పింది.. దీంతోపాటు యాంటీ మిస్సైల్ డిఫెండర్ అయిన INS విక్రాంత్ ను అరేబియా సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం.. ఇదంతా చూస్తుంటే భారత్, పాక్ మధ్య యుద్దం రాబోతుందా అంటే అవుననే తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడిపై గురువారం ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమాయకపు టూరిస్టుల ప్రాణాలు తీసిని ఏ ఒక్క టెర్రరిస్టులను, వారికి మద్దతిస్తున్న వారిని వదిలిపెట్టబోమని శపథం చేశారు.ఈ క్రమంలో సెక్యూరిటీలో కేబినెట్ కమిటీలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్27 వరకు భారత్లో ఉన్న పాకిస్తానీయులకు డెడ్లైన్ విధించారు. 29 వరకు భారత్ లో ఉన్న పాకిస్తానీయులు పూర్తిగా భారత్ విడిచిపెట్టి వెళ్లిపోవాలని తెలిపింది. పాక్ లో ఉన్న భారత్ హైకమిషనర్లను ఇండియాకు రావాలని కోరింది.
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం తీసుకున్న కఠిన చర్యలకు పాకిస్తాన్ అరేబియా సముద్రంలో కాల్పుల విన్యాసాలు ప్రారంభించింది. పాకిస్తాన్ చర్యకు ప్రతిస్పందనగా భారత నావికాదళం విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను సముద్రంలో దింపింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మిగ్-29కె ఫైటర్ జెట్‌లు, దాడి హెలికాప్టర్లు మోహరించారు. పహల్గామ్ ఊచకోత తర్వాత భారతదేశం తీసుకున్న చర్యకు భయపడిన పాకిస్తాన్..గ్వాదర్ ఓడరేవు సమీపంలో క్షిపణి కాల్పుల విన్యాసాలు ప్రారంభించింది. దీనికి ధీటుగా ఐఎన్ఎస్ విక్రాంత్ నావికాదళానికి చెందిన కార్వార్ నావల్ బేస్ నుంచి బయలుదేరి అరేబియా సముద్రం వైపు వెళుతున్న ఫొటోలను ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
INS విక్రాంత్ ఎంత శక్తివంతమైనదంటే..
దేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది 40 యుద్ధ విమానాలను స్వయంగా మోసుకెళ్లగలదు. INS విక్రాంత్ జనరల్ ఎలక్ట్రిక్ లో శక్తివంతమైన టర్బైన్లతో అమర్చబడి ఉంది. ఈ యుద్ధనౌకలో 2 స్క్వాడ్రన్ల మిగ్ 29 ఫైటర్ జెట్‌లు ,10 క్మావ్ కా-31 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ విమాన వాహక నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి 1500 కి.మీ. ఇందులో 64 బరాక్ క్షిపణులతో ఉన్నాయి. ఇవి ఓడ నుండి గగనతలానికి దాడులు చేయగలవు. INS విక్రాంత్ దాని బలం ,సామర్థ్యాల కారణంగా ప్రపంచంలోని టాప్-10 విమాన వాహక యుద్ధనౌకలలో ఒకటిగా ఉంది.