ఇండియాలో పుంజుకున్న సర్వీసెస్‌‌ సెక్టార్‌‌‌‌

ఇండియాలో పుంజుకున్న సర్వీసెస్‌‌ సెక్టార్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశ సర్వీసెస్ సెక్టార్‌‌‌‌ కిందటి నెలలో  స్ట్రాంగ్ గ్రోత్ నమోదు చేసింది. బిజినెస్ యాక్టివిటీ మెరుగవ్వడంతో సేల్స్‌‌ ఊపందుకున్నాయి. సర్వీసెస్ సెక్టార్ పనితీరును కొలిచే హెచ్‌‌ఎస్‌‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్‌‌ యాక్టివిటీ ఇండెక్స్‌‌ (పీఎంఐ)  కిందటి నెలలో 61.2 కి పెరిగింది. అంతకు ముందు నెలలో ఈ నెంబర్ 60.6  గా నమోదయ్యింది. గత పదమూడున్నరేళ్లలో  ఇది హయ్యెస్ట్ కావడం విశేషం.

పీఎంఐ ఇండెక్స్‌‌ 50 కి పైన ఉంటే బిజినెస్ విస్తరిస్తున్నట్లు. ‘ ఫిబ్రవరిలో కొద్దిగా తగ్గిన పీఎంఐ  సర్వీసెస్‌‌, మార్చిలో పెరిగింది. డిమాండ్ బాగుండడంతో సేల్స్ పెరిగాయి. సర్వీసెస్ కంపెనీలు నియామకాలను వేగంగా చేపడుతున్నాయి’ అని హెచ్‌‌ఎస్‌‌బీసీ ఎకనామిస్ట్‌‌ ఇనెస్‌‌ లామ్‌‌ అన్నారు.