జీడీపీ 7 శాతం పెరిగే చాన్స్​

జీడీపీ 7 శాతం పెరిగే చాన్స్​

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.5–7 శాతం వృద్ధి చెందుతుందని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ రిపోర్ట్‌‌‌‌లో  పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు వరకు చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్ నిలకడగా ఉందని, ఇన్‌‌‌‌ఫ్లేషన్ తగ్గుతోందని, పెట్టుబడులు

ఉద్యోగ కల్పన మెరుగ్గా ఉన్నాయని మంత్లీ ఎకనామిక్ రివ్యూలో వివరించింది. గ్లోబల్‌‌‌‌గా పరిస్థితులు బాగోలేకపోవడంతో రిస్క్‌‌‌‌లు లేకపోలేదని తెలిపింది. రానున్న క్వార్టర్లలో  ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయని, గ్రోత్ ఊపందుకుంటుందని ఫైనాన్స్ మినిస్ట్రీ అంచనా వేసింది.