అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటను డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముందునుంచి చెపుతున్నట్లుగానే అమెరికా వలస విధానాలు పూర్తిగా మార్చేశారు. దేశంలో అక్రమంగా ఎవరూ ఉండొద్దని హుకుంజారీ చేశారు.ఈ క్రమంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులుకూడా వెళ్లిపోవాలని ఆర్డర్స్ పాస్ చేశారు. ఇండియా కూడా అమెరికాలో వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకొని వారిని వెనక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ పౌరులందరినీ గుర్తించి,స్వదేశానికి రప్పించేందుకు డొనాల్డ్ ట్రంప్ కు సహకరించేందుకు భారత్ సిద్దంగా ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్టులు చెబుతున్నాయి. దాదాపు 18వేల మంది అక్రమ భారతీయ వలసదారులను వెనక్కి పంపాలని అమెరికా గుర్తించింది.. దీనికోసం భారత్ ధృవీకరంచి బహిష్కరణ ప్రక్రయ ప్రారంభిస్తుందని నివేదిక పేర్కొంది.
సోమవారం ( జనవరి 20) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ట్రంప్ అక్రమవలసల నియంత్రణపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాలో ఇతర దేశాలకు చెందిన వారు ఎవరూ అక్రమంగా ఉండకూడదని హుకుం జారీచేశారు. అమెరికా దక్షిణ సరిహద్దులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
దేశంలోకి అక్రమ ప్రవేశం ఇకపై సాగదని.. తన పరిపాలనలో మిలియన్ల కొద్ది అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించడం ప్రారంభమయ్యిందని ప్రకటించారు ట్రంప్.
అమెరికాల అధికారిక లెక్కల ప్రకారం.. 2023-24లో 1100 మంది భారతీయ పౌరులను అమెరికా డిపార్టుమెంట్ ఆఫ హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగంబహిష్కరించింది. భారత్ సహా 145 దేశాలకు చెందిన స్వదేశీ విమానాల ద్వారా లక్షా 60వేల మందిని పంపించారు.
2024లో చట్టవిరుద్ధంగా అమెరికాలో కి ఉత్తర సరిహద్దు ద్వారా వలసలు పెరిగాయి. ఇందులో 3 శాతం మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
022 నుండి, ఫిలిప్పీన్స్‌ను అధిగమించి, యుఎస్ చెక్‌పోస్టులలో ఆసియా నుండి అక్రమ వలసదారులలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.
2023-2024లో 90,415 మంది భారతీయులు అక్రమ ప్రవేశానికి ప్రయత్నించారని గుర్తించారు. 2022 నాటికి అమెరికా వ్యాప్తంగా ఉన్న 13.3 మిలియన్ల అక్రమ వలసదారుల్లో 2లక్షల 20వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు.
దశబ్దానికి పైగా ధృవీకరణ పత్రాలు లేని వలసదారుల్లో మూడింట రెండు వంతుల మంది అమెరికాలో నివసిస్తున్నారు. వీరిలో వ్యవసాయం, ఆతిథ్యం, నిర్మాణం, ఆరోగ్యం వంటి రంగాల్లో శ్రామికశక్తిగా సహకరిస్తున్నారు.
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ (AIC) ప్రకారం..ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్లాన్ ప్రకారం 315 బిలియన్ డాలర్ల , $1 ట్రిలియన్ డాల్లర మధ్య అంచనా వ్యయంతో 20వేల నుండి -- 4లక్షల 09వేల ICE సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది.
2023లో మంజూరైన 386,000 H-1B వీసాలలో దాదాపు 75శాతం పౌరులు కలిగి ఉన్నందున భారతదేశం చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ మార్గాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులుకూడా వెళ్లిపోవాలని ఆర్డర్స్ పాస్ చేయడంతో ఇండియా కూడా అమెరికాలో వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకొని అమెరికాకు సహకరించడం ద్వారా వారిని వెనక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.