
మూనిచ్: ఇండియా షూటర్ సిఫ్ట్ కౌర్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో బ్రాంజ్ మెడల్‌తో మెరి సింది. శుక్రవారం ముగి సిన ఈ టోర్నీలో విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ ఫైనల్లో 452.9 స్కోరుతో మూడో స్థానం సాధించింది. 0.1 స్కోరుతో చైనాకు చెందిన వరల్డ్ చాంపియన్ షూటర్ హన్ జియవు (453)కు సిల్వర్ మెడల్ కోల్పోయింది. వరల్డ్ నంబర్ వన్ సియోనియడ్ మింతోష్ (బ్రిటన్) 466.7 స్కోరుతో గోల్డ్ నెగ్గింది. గురువారం మెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్ గోల్డ్ అందుకోగా ఈ టోర్నీని ఇండియా రెండో మెడల్స్‌తో ముగించింది.