ఇంటర్నెట్పై ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిరంకుశ పాలన సాగిస్తున్న చైనా, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాల్లో ఇంటర్నెట్ను సెన్సార్ చేయడం, పరిమితులు విధించడం వంటి ఆంక్షలు ఉన్నాయి.
భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో పౌరులకు ఇంటర్నెట్ హైస్పీడ్ తో అందుబాటులో ఉంది. అయితే భారత్ లో కూడా బ్లాక్ అవుట్(ఇంటర్నెట్ షట్ డౌన్) అమలు చేయడం జరుగుతోందని యాక్సెస్నౌ డేటా వెల్లడించింది.
డిజిటల్రైట్స్ వాచ్ డాగ్ యాక్సెస్ నౌ షేర్ చేసిన డేటా ప్రకారం.. దాదాపు గడిచిన పదేళ్లలో ఇంటర్నెట్ షట్ డౌన్ లలో భారత్మొదటిస్థానంలో ఉంది. 2016 నుంచి 2023 వరకు భారత్ లో 771 సార్టు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. ఒక్క 2024లో నే 51సార్లు భారత్ ఇంటర్నెట్పై ఆంక్షలు విధించారు.
మయన్మార్, ఉక్రెయిన్ వరుసగా 2022,2023లో ఇంటర్నెట్ షట్ డౌన్ ల జాబితాలు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల్లో అంతర్గత కల్లోలాలు, ఘర్షణలు తీవ్రస్థాయిలో ఉన్నాయన్న విషయం తెలిసిందే.
గతేడాది భారత ప్రభుత్వం 116 సార్లు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిందని యాక్సెస్ నౌ డేటా వెల్లడించింది. మయన్మార్ , ఇరాన్ 37, 34 షట్ డౌన్ లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 2024లో ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇంటర్నెట్ కనెక్టివిటీ తగ్గించడంలో భారత్మొదటి స్థానంలో మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.