![కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో భారత్కు 96వ స్థానం](https://static.v6velugu.com/uploads/2025/02/lips-to-96th-position-in-corruption-perceptions-index-rankings_nGAZqK6M2v.jpg)
కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ) – 2024 నివేదికలో 38 పాయింట్లతో భారత్ 96వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది39 పాయింట్లతో 93వ స్థానంలో ఉండగా, 2022లో 40 పాయింట్లతో 85వ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నివేదికను వెలువరించింది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తలు అభిప్రాయాలు తీసుకుని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సున్నా నుంచి 100 మధ్యలో పాయింట్లను కేటాయించింది. సున్నా అయితే అవినీతి ఎక్కువని, 100 అయితే అవినీతి రహితమని పేర్కొన్నది.
అవినీతి తక్కువ ఉన్న దేశాలు: మొదటి స్థానంలో డెన్మార్క్, రెండో స్థానంలో ఫిన్లాండ్, మూడో స్థానంలో సింగపూర్, నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో లక్సెంబర్గ్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి.
అవినీతి ఎక్కువ ఉన్న దేశాలు: 180వ స్థానంలో సౌత్ సూడాన్, 179వ స్థానంలో సోమాలియా, 178వ స్థానంలో వెనెజులా, 177వ స్థానంలో సిరియా దేశాలు ఉన్నాయి.
- భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్ (135), శ్రీలంక(121), బంగ్లాదేశ్(149), చైనా(76) స్థానాల్లో నిలిచాయి.
- ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్అనే సంస్థను 1993లో జర్మనీలోని బెర్లిన్లో స్థాపించారు. ప్రపంచ దేశాల్లో అవినీతి స్థాయిని అంచనా వేసి, నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సంస్థ గ్లోబల్ కరప్షన్ బారోమీటర్, కరప్షన్పర్సెప్షన్ ఇండెక్స్ లను ప్రచురిస్తుంది.