భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

భారత్ పై తొలిసారిగా కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. రష్యా విషయంలో భారత్ కాస్త వణుకుతోందని విమర్శించారు జో బైడెన్. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను శిక్షించే పాశ్చాత్య ఆంక్షలపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం భారత్ 'కొంతవరకు వణుకుతోంది' అని అన్నారు. బిజినెస్ రౌండ్‌టేబుల్ యొక్క CEO క్వార్టర్లీ మీటింగ్‌లో మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒంటరిగా చేసే విషయంలో అమెరికా, ఇతర మిత్రదేశాలలో భారతదేశం ఒక మినహాయింపుగా నిలుస్తోందని బిడెన్ సూచించారు.

రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. భారత్‌లో స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు కనిపించట్లేదని ఆయన చెప్పారు. క్వాడ్ సభ్య దేశాల్లో కూడా భారత్ అలాగే ఉందన్నారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా.. క్వాడ్‌లో సభ్యత్వం గల దేశాలు. ఇందులో భారత్ మినహాయిస్తే- మిగిలిన రెండూ రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయి.

జపాన్ , ఆస్ట్రేలియా ఇదివరకే రష్యాపై ఆంక్షలను విధించాయి. జపాన్ చాలా బలంగా ఉందన్నారు బైడెన్. పుతిన్ దూకుడు విషయంలో ఆస్ట్రేలియా కూడా అలాగే ఉందన్నారు. బిడెన్ తన వ్యాఖ్యలలో ఉక్రెయిన్‌పై తన దండయాత్రకు ప్రపంచ ప్రతిస్పందనలో NATO,పాశ్చాత్య మిత్రదేశాలు ఎంత ఐక్యంగా ఉంటాయో పుతిన్ ఊహించలేడన్నారు బైడెన్.  ఈ యుద్ధంలో రష్యా వైఖరిని తప్పు పడుతూ వస్తున్నాయన్నారు. భారత్. రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగివున్న భారత్.. రష్యాతో వైరం ఏ మాత్రం కోరుకోవట్లేదు. అలాగనీ- యుద్ధాన్ని గానీ, ఈ విషయంలో రష్యాను గానీ సమర్థించట్లేదు. తటస్థంగా ఉంటోంది.