Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ రేస్‌లో నలుగురు స్పిన్ ఆల్ రౌండర్లు.. ఇద్దరికే ఛాన్స్

చాంపియన్స్‌‌ ట్రోఫీ కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు రెడీ అవుతున్నారు. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీకి జట్టును ప్రకటించేందుకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఉంది. ఆదివారం (జనవరి 12) జరగబోయే సెలెక్షన్​ కమిటీ సమావేశంలో టీమ్‌‌ను ఖరారు చేయనుంది. 15 మంది స్క్వాడ్ లో ఈ మెగా టోర్నీకి ఎవరు ఎంపికవుతారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా స్పిన్ అల్ రౌండర్లలో ఎవర్ని ఎంపిక చేయాలో సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. 

ఛాంపియన్స్ ట్రోఫీ రేస్‌లో భారత జట్టు తరపున నలుగురు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్ టన్ సుందర్, రియాన్ పరాగ్ లలో ఇద్దరికే ఛాన్స్ దక్కనుంది. సీనియర్ ఆల్ రౌండర్ జడేజా పెర్ఫామెన్స్‌‌ వైట్‌‌బాల్‌‌ మ్యాచ్‌‌ల్లో మునుపటిలా లేదు.  గతంలో ఆల్‌‌రౌండర్‌‌గా విశిష్ట సేవలందించిన జడ్డూ ప్రస్తుతం జట్టుకు భారంగా కనిపిస్తున్నాడు. దీంతో వన్డేల్లో జడేజా ప్లేస్‌‌కు అక్షర్‌‌ పటేల్‌‌ సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్‌‌ స్పిన్నర్‌‌గా వాషింగ్టన్‌‌ సుందర్‌‌ పనికొస్తాడని భావిస్తున్నా ఈ ముగ్గురిలో ఎవరుంటారో  చూడాలి. 

Also Read : ఛాంపియన్స్ ట్రోఫీకి ఇద్దరు స్టార్ ఫాస్ట్ బౌలర్లు ఔట్

ఈ ముగ్గురితో పాటు పరాగ్ సైతం ఈ రేస్ లో ఉన్నాడు. ఈ ముగ్గురి కంటే పరాగ్ బ్యాటింగ్ బ్యాటింగ్ చేయగలడు. దీంతో సెలక్టర్లు ఈ యువ క్రికెటర్ ను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. అనుభవం దృష్ట్యా జడేజాకు సెలక్టర్లు ఓటు వేయొచ్చు. మరోవైపు ఇటీవలే వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొడుతున్న అక్షర్ పటేల్ సెలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అదే జరిగితే సూపర్ ఫామ్ లో ఉన్న సుందర్, ఛాన్స్ వస్తే నిరూపించుకుందామని రెడీగా ఉన్న పరాగ్ లకు నిరాశ తప్పకపోవచ్చు.