కొట్టలేక.. టైతో సరిపెట్టారు

కొట్టలేక.. టైతో సరిపెట్టారు
  • 18 బాల్స్​​లో 5 రన్స్‌‌‌‌ చేయలేక గెలుపు దూరం 
  • లంకతో టీమిండియా తొలి వన్డే టై

కొలంబో: ఇండియా, శ్రీలంక మధ్య ఉత్కంఠగా సాగిన తొలి వన్డే ‘టై’గా ముగిసింది. చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కెప్టెన్‌‌ రోహిత్ శర్మ అద్భుత ఆరంభం ఇచ్చినా మిడిల్ లోయర్ ఆర్డర్ వైఫల్యంతో ఇండియా విజయాన్ని చేజార్చుకుంది. చివరి 18 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా విజయానికి 5 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం కాగా, లంక బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్ అసలంక (3/30) చివరి రెండు వికెట్లు తీసి తమ జట్టుకు ఓటమి తప్పించాడు. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో  టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన లంక  తొలుత 50 ఓవర్లలో 230/8 స్కోరు చేసింది.

దునిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లలాగే (67 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), పాథుమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిశాంక (56) హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీలు సాధించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసిన ఇండియా బౌలర్లు మిగతా లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేశారు. వానిందు హసరంగ (24), అకిల ధనంజయ (17), కుశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (14), చరిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసలంక (14)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 47.5 ఓవర్లలో 230 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (58), అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (33), కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (31), శివందూబే (25), కోహ్లీ (24), శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (23) పోరాడి ఫెయిలయ్యారు. హసరంగ 3, దునిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు.  దునిత్‌ ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆదివారం రెండో వన్డే జరుగుతుంది.