
బ్యాంకాక్: ఇండియా స్టార్ బాక్సర్లు అమిత్ పంగల్, జాస్మిన్ లంబోరియా.. పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. రెండో అంచె వరల్డ్ క్వాలిఫికేషన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మెన్స్ 51 కేజీ క్వార్టర్ ఫైనల్లో అమిత్ 5–0తో చుయాంగ్ లియు (చైనా)పై గెలవగా, విమెన్స్ 57 కేజీ క్వార్టర్స్‌లో జాస్మిన్ కూడా 5–0తో మారిన్ కామారా (మాలి)ని చిత్తు చేసింది. సెమీస్‌కు చేరుకోడం ద్వారా ఈ ఇద్దరికీ ఒలింపిక్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి.