పారిస్ ఒలంపిక్స్ లో జ్యోతి, అవినాశ్‌‌కు చుక్కెదురు

పారిస్ ఒలంపిక్స్ లో జ్యోతి, అవినాశ్‌‌కు చుక్కెదురు

పారిస్‌: ఇండియా స్టార్‌‌‌‌ స్ప్రింటర్, తెలుగమ్మాయి యెర్రాజి జ్యోతి అరంగేట్ర ఒలింపిక్స్‌‌ను నిరాశగా ముగించింది. విమెన్స్‌‌ 100 మీటర్ల హార్డిల్స్‌‌కు అర్హత సాధించిన దేశ తొలి అథ్లెట్‌‌గా నిలిచిన జ్యోతి ఈ ఈవెంట్‌‌లో కనీసం సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది. గురువారం జరిగిన రెపిఛేజ్ రౌండ్ హీట్‌‌లో జ్యోతి 13.17 సెకండ్లతో 40 మంది రన్నర్లలో 16వ స్థానంతో సరిపెట్టి ఇంటిదారి పట్టింది. 

మరోవైపు లాంగ్ డిస్టెన్స్‌‌ రన్నర్ అవినాశ్ సాబ్లే పతకానికి చాలా దూరంలో నిలిచిపోయాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌ 3000 మీటర్ల స్టీపుల్‌‌ఛేజ్‌‌ ఫైనల్‌‌ను సాబ్లే 8 నిమిషాల 14.18 సెకండ్లతో పూర్తి చేసి 11వ స్థానంతో సరిపెట్టాడు. మొరాకో రన్నర్ సౌఫియానె బకాలి 8 నిమిషాల 06.05 సెకండ్ల టైమింగ్‌‌తో మరోసారి స్వర్ణం సొంతం చేసుకోగా.. కెనెత్ రాక్స్ (8:06.41సె; అమెరికా) రజతం, అబ్రహమ్ కిబివోట్ (8:06.47 సె; కెన్యా) కాంస్యం గెలిచారు.