వినేశ్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌

వినేశ్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌

మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌ వినేశ్‌‌‌‌‌‌‌‌ ఫోగట్‌‌‌‌‌‌‌‌.. స్పెయిన్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ ప్రిలో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ 50 కేజీ ఫైనల్లో వినేశ్‌‌‌‌‌‌‌‌ 10–5తో మరియా టిమురెకోవా (రష్యా)పై నెగ్గింది. బౌట్‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌.. ప్రత్యర్థికి కోలుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. అంతకుముందు జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌లో వినేశ్‌‌‌‌‌‌‌‌ 9–4తో కేటి డట్చక్‌‌‌‌‌‌‌‌ (కెనడా)పై, క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో విన్‌‌‌‌‌‌‌‌ బై ఫాల్‌‌‌‌‌‌‌‌తో మాడిసన్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ (కెనడా)పై, తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో 12–4తో యుస్నెలిస్‌‌‌‌‌‌‌‌ గుజ్మాన్‌‌‌‌‌‌‌‌ (క్యూబా)పై గెలిచింది.