బ్లూమ్‌ఫోంటైన్ : అండర్–19 వరల్డ్ కప్‌లో ఇండియా కుర్రాళ్లు వరుసగా రెండో విజయాన్ని సాధించారు. ముషీర్ ఖాన్ (118) సెంచరీకి తోడుగా కెప్టెన్ ఉదయ్ సహారన్ (75) చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 201 రన్స్ భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది.
టాస్ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 301/7 స్కోరు చేసింది. 80 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయిన ఇండియాను ముషీర్, ఉదయ్ మూడో వికెట్‌కు 156 రన్స్ జోడించి ఆదుకున్నారు. ఒలివర్ రీలె 3, జాన్ మెక్నల్లీ 2 వికెట్లు తీశారు. తర్వాత ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 రన్స్‌కే కుప్పకూలింది.
డానియెల్ ఫోర్కిన్ (27 నాటౌట్) టాప్ స్కోరర్. నమన్ తివారీ 4, సౌమీ పాండే 3 వికెట్లు తీశారు. ముషీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.