- యశస్వి హాఫ్ సెంచరీ
- 4 వికెట్లతో దెబ్బకొట్టిన బషీర్
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 ఆలౌట్
రాంచీ: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో ఇండియా బ్యాటింగ్‌లో తడబడింది. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(117 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 73) ఒంటరి పోరాటం చేసినా.. ఇంగ్లిష్ యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/84) దెబ్బకు టీమిండియా టాప్, మిడిలార్డర్ కుదేలైంది. దీంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 219/7 స్కోరు చేసింది.
ధ్రువ్ జురెల్ (30 బ్యాటింగ్), కుల్దీప్ యాదవ్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 302/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 104.5 ఓవర్లలో 353 రన్స్‌కు ఆలౌటైంది. జో రూట్ (274 బాల్స్‌లో 10 ఫోర్లతో 122 నాటౌట్) అజేయంగా నిలవగా, ఒలీ రాబిన్సన్ (58) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 102 రన్స్ జోడించారు. ప్రస్తుతం ఇండియా ఇంకా 134 రన్స్ వెనకబడి ఉంది.
‘అంపైర్ కాల్’ దెబ్బ..
తొలి సెషన్ రెండో గంటలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు థర్డ్ ఓవర్‌లోనే షాక్ తగిలింది. అండర్సన్ (1/36) వేసిన ఆఫ్‌సైడ్ స్వింగ్ బాల్ రోహిత్ శర్మ (2) బ్యాట్‌ను తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 4/1 స్కోరుతో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను యశస్వి, గిల్ (38) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 34/1 స్కోరుతో లంచ్‌కు వెళ్లొచ్చిన ఇండియాను స్పిన్నర్ షోయబ్ బషీర్ సూపర్ టర్నింగ్‌తో దెబ్బకొట్టాడు. యశస్వి, గిల్ సింగిల్స్‌తో ముందుకెళ్లినా.. ‘అంపైర్ కాల్’ దెబ్బకొట్టాయి.
25వ ఓవర్‌లో బషీర్ బాల్.. గిల్ ప్యాడ్లను తాకడంతో ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఇండియా డీఆర్‌ఎస్‌కు వెళ్లగా ‘ఇంపాక్ట్’లో అంపైర్స్ కాల్స్ రావడంతో రెండో వికెట్‌కు 82 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 35వ ఓవర్‌లో బషీర్ వేసిన స్ట్రయిట్ బాల్‌కు రజత్ పటీదార్ (17) ఎల్బీగా ఔటయ్యాడు. దీనికి రివ్యూ కోరగా అంపైర్ కాల్ రావడంతో రజత్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు 89 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన యశస్వికి జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14) కాసేపు అండగా నిలిచారు. ఈ ముగ్గురు కలిసి 49 రన్స్ జోడించినా 15 ఓవర్ల తేడాలో ఔటయ్యారు. దీంతో ఇండియా 171/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో జురెల్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు.
కానీ రెండో ఎండ్‌లో అశ్విన్ (1)కు కూడా అంపైర్ కాల్ ఎదురైంది. 56వ ఓవర్‌లో హర్ట్‌లీ (2/47) వేసిన బాల్‌ను అశ్విన్ డిఫెన్స్ చేయబోగా అది అతని షూను తాకింది. రివ్యూలో బంతి లెగ్ స్టంప్ చివరను తాకుతున్నట్టు తేలడంతో అంపైర్ కాల్ వచ్చింది. చివర్లో కుల్దీప్ యాదవ్ , జురెల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త
పడ్డారు. ఈ ఇద్దరూఎనిమిదో వికెట్‌కు 42 రన్స్ జోడించడంతో ఇండియా స్కోరు 200 మార్కు దాటింది.
ఒకే సిరీస్‌లో 600 ప్లస్ రన్స్ చేసిన ఐదో ఇండియన్ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353 ఆలౌట్ (రూట్ 122*, రాబిన్సన్ 58, జడేజా 4/67, ఆకాశ్ దీప్ 3/83). ఇండియా తొలి ఇన్నింగ్స్: 73 ఓవర్లలో 219/7 (యశస్వి జైస్వాల్ 73, గిల్ 38, షోయబ్ బషీర్ 4/84).