బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా ఓటమి

బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా ఓటమి

కింగ్‌‌‌‌డావో (చైనా) : బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌–డి రెండో మ్యాచ్‌‌‌‌లో ఇండియా 2–3తో సౌత్‌‌‌‌ కొరియా చేతిలో ఓడింది. దీంతో గ్రూప్‌‌‌‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నా ఇప్పటికే క్వార్టర్స్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌‌‌‌లో ధ్రువ్‌‌‌‌ కపిల–తానీషా క్రాస్టో 21–11, 12–21, 15–21తో డాంగ్‌‌‌‌ జు కీ–జియోంగ్‌‌‌‌ చేతిలో, విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో మల్విక బన్సోద్‌‌‌‌ 9–21, 10–21తో యు జిన్‌‌‌‌ సిమ్‌‌‌‌ చేతిలో ఓడారు. .

అయితే మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో సతీశ్‌‌‌‌ కరుణాకరన్​​ 17–21, 21–18, 21–19తో చో జియోనియోప్‌‌‌‌పై, విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ట్రీసా జోలీ–గాయత్రి 19–21, 21–16, 21–11తో కిమ్‌‌‌‌ మిన్‌‌‌‌ జి–కిమ్‌‌‌‌ యు జుంగ్‌‌‌‌పై గెలవడంతో ఇరుజట్ల స్కోరు 2–2తో సమమైంది. అయితే డిసైడర్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–ఎంఆర్‌‌‌‌ అర్జున్‌‌‌‌14–21, 15–23తో సంగ్ సియోంగ్‌‌‌‌–జిన్‌‌‌‌ యంగ్ చేతిలో ఓడారు.