ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో అమెరికా, జర్మనీ దేశాల ప్రతినిధులు స్పందించడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనా చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి మిషన్ గ్లోరియా బెర్బెనాని బుధవారం పిలిచించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశమని, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని సమాన్లు జారీ చేసింది. 40 నిమిషాల పాటు ఈ విషయంలో అమెరికా ప్రతినిధితో విదేశాంగ శాఖ అధికారులు సమావేశం అయ్యారు.
Also Read: కేరళ సీఎం కూతురిపై ఈడీ మనీలాండరింగ్ కేసు
కేజ్రీవాల్ పై ఈడీ విచారణ, అరెస్ట్ ను ఉద్దేశించి న్యాయమైన, పారదర్శక, సమయానుకూల న్యాయప్రక్రియ ఉండేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిషన్ గ్లోరియా స్పందించిన విషయం తెలిసిందే. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర భారతీయుల మాదిరిగానే కేజ్రీవాల్ పై కూడా న్యాయమైన, నిష్పాక్షిక విచారణ జరపాలని జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎంజ్వీలర్ అన్నారు. ఈయన వ్యాఖ్యలను కూడా విదేశాంగ శాఖ ఖండించింది. సాటి ప్రజాస్వాయ దేశాల విషయాల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని భారత్ శుక్రవారం జర్మనీ విధానాల పట్ల హెచ్చరించింది.