దేశంలో 54 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 54 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. గత వారం రోజుల నుంచి దేశంలో ప్రతిరోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేవలం ఒక్క సెప్టెంబర్ నెలలోనే 17 లక్షల కేసులు నమోదయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 92,605 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. శనివారం నాటి కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54 లక్షల మార్కును దాటింది. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 54,00,620కి చేరింది. ఇందులో 10,10,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 43,03,044గా ఉంది. శనివారం ఒక్కరోజే 94,612 మంది డిశ్చార్జ్ అయి కోలుకున్నారు. శనివారం దేశవ్యాప్తంగా 1,133 మంది కరోనాతో మ‌రణించారు. దాంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 86,752కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.61 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

శనివారం దేశవ్యాప్తంగా 12,06,806 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 6,36,61,060 టెస్టులు చేసినట్లు తెలిపింది.

For More News..

రాష్ట్రంలో మరో 2,137 కరోనా పాజిటివ్ కేసులు

చనిపోవాలని డిసైడ్​ అయ్యా.. సోషల్​ మీడియాలో నిరుద్యోగి సెల్ఫీ వీడియో

కరోనా రికవరీల్లో అమెరికాను దాటేసిన ఇండియా