కరోనా రికవరీల్లో అమెరికాను దాటేసిన ఇండియా

కరోనా రికవరీల్లో అమెరికాను దాటేసిన ఇండియా

రికవరీల్లో మనమే ఫస్ట్

దేశంలో కరోనా రికవరీ రేటు 79.28 శాతం

అమెరికాను వెనక్కి నెట్టామన్న హెల్త్​ మినిస్ట్రీ

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల రికవరీలో ప్రపంచంలోనే మన దేశం టాప్​లో ఉందని సెంట్రల్​ హెల్త్​ మినిస్ట్రీ వెల్లడించింది. గత 24 గంటల్లో దాదాపు 95,885 మంది రికవర్​ అయినట్టు తెలిపింది. అయితే దేశంలో కేసుల సంఖ్య 53 లక్షలు దాటిందని తెలిపింది. కరోనా రికవరీ కేసుల విషయంలో ఇండియా అమెరికాను దాటేసిందని వెల్లడిస్తూ ఓ ట్వీట్​ చేసింది. ఇప్పటి వరకూ 42 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని, అదే అమెరికాలో 41 లక్షల మంది రికవర్​ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 79.28 శాతంగా ఉందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు, ఎక్కువ సంఖ్యలో టెస్టులను చేయడం, హైక్వాలిటీ ట్రీట్​మెంట్, సర్వయిలెన్స్​ వల్లే రికవరీల సంఖ్య పెరిగిందని వెల్లడించింది.

కేసుల్లో ప్రపంచంలోనే సెకెండ్​ ప్లేస్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా రెండో స్థానం లో ఉంది. ప్రపంచంలోని మొత్తం కేసుల్లో 17 శాతం మన దేశంలోనే రికార్డవుతున్నాయి. సెప్టెంబర్​ నెల మొదలైనప్పటి నుంచి దేశంలో రోజుకు సగటున 90 వేలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క సెప్టెంబర్​లోనే 16,86,769 కొత్త కేసులు రికార్డయ్యాయి. అయితే జనాభాతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే మన దగ్గర తక్కువని కేంద్రం చెబుతోంది. మరోవైపు దేశంలో మరణాల రేటు కూడా 1.61 శాతమేనని శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో హెల్త్​ మినిస్ట్రీ స్పష్టం చేసింది.

For More News..

డాక్టర్లపై దాడిచేస్తే ఏడేళ్లు జైలు, 5 లక్షల ఫైన్

న్యూయార్క్‌‌‌‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

నీళ్లు, కరెంట్ బిల్లుల్లో 50% డిస్కౌంట్