పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (5/60) చెలరేగిపోయాడు. కరీబియన్ లోయర్ ఆర్డర్‌ను బెంబేలెత్తిస్తూ ఇండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. 229/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట కొనసాగించిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 115.4 ఓవర్లలో 255 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 183 రన్స్ లీడ్ లభించింది. వానతో ఆట ఆగిన టైమ్‌కు ఇండియా 118/2 స్కోరుతో నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (44 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) తన టెస్ట్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (35 బాల్స్) సాధించాడు.
యశస్వి (38) ఔటవగా.. గిల్ (10 బ్యాటింగ్), ఇషాన్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా301 రన్స్ లీడ్‌లో కొనసాగుతున్నది. అంతకుముందు డే ఆరంభం నుంచే సిరాజ్ అద్భుతమైన సీమ్ పర్ఫెక్షన్ బాల్స్‌తో విండీస్ బ్యాటర్లను కట్టడి చేశాడు. తొలి ఓవర్‌లోనే ముకేశ్ (2/48) సూపర్ ఇన్‌స్వింగర్‌తో అలిక్ అథనాజే (37)ను ఔట్ చేయడంతో వికెట్ల పతనం మొదలైంది.
తర్వాత జోరందుకున్న సిరాజ్.. వరుస విరామాల్లో జేసన్ హోల్డర్ (15), అల్జారీ జోసెఫ్ (4), కీమర్ రోచ్ (4), షనన్ గాబ్రియోల్ (0)ను ఔట్ చేసి టెస్ట్ కెరీర్‌లో రెండోసారి ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నాడు. జడేజా 2, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు రోహిత్ మెరుపు ఆరంభం ఇచ్చాడు. తను ఔటయ్యాక వాన రావడంతో షెడ్యూల్ టైమ్ కంటే ముందుగానే లంచ్‌కు వెళ్లారు. లంచ్ తర్వాత మరోసారి వాన రావడంతో ఆట ఆగిపోయింది.