న్యూఢిల్లీ: ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెనూర్‌షిప్, ఎలక్ట్రానిక్స్ తయారీలో మనదేశం ఎంతో ఎదుగుతున్నందున లక్ష యునికార్న్‌లను, 10–-20 లక్షల స్టార్టప్‌లను సృష్టించవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి టెక్నాలజీలను ఎలా ఉపయోగించవచ్చో చూపించిందని అన్నారు. ప్రభుత్వం, పాలన, ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ పరిధి మరింత వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.
గత రెండు సంవత్సరాలుగా భారతదేశం డిజిటల్ ఎజెండాకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దేశంలో ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ల తయారీరంగం దూసుకువెళ్తోందని చెప్పారు. ఆయన ఇటీవలే ఈశాఖ మంత్రిగా రెండేళ్లు పూర్తి చేశారు. డిజిటల్ ఇండియా డ్రాఫ్ట్ బిల్లు బుధవారం క్యాబినెట్ ఆమోదం పొందింది.