
న్యూఢిల్లీ: తెలంగాణ యంగ్ అథ్లెట్లు గంధె నిత్య, అగసర నందిని ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పోటీపడే ఇండియా టీమ్‌కు ఎంపికయ్యారు. సౌత్ కొరియాలో మే 27 నుంచి 31 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) 59 మందితో కూడిన టీమ్‌ను శుక్రవారం ప్రకటించింది. కొచ్చిలో గురువారం ముగిసిన ఫెడరేషన్ కప్‌లో సత్తా చాటిన అథ్లెట్లకు అవకాశం ఇచ్చింది. స్ప్రింటర్ నిత్య 200 మీటర్ల రన్‌తో పాటు విమెన్స్ 4x100 మీటర్ల రిలే బృందానికి కూడా ఎంపికైంది.
ఫెడరేషన్ కప్‌లో నిత్య 100 మీ., 200 మీ. ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్‌తో సత్తా చాటింది. హెప్టాథ్లాన్‌లో గోల్డ్ నెగ్గిన అగసర నందిని ఆసియా అథ్లెటిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 100 మీ. హర్డిల్స్ స్టార్ ఏపీకి చెందిన యెర్రాజి జ్యోతి కూడా ఆసియాడ్‌కు ఎంపికైంది. మరోవైపు డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాఈ టోర్నీకి దూరంగా ఉంటున్నాడు. డైమండ్ లీగ్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అతను ఆసియా అథ్లెటిక్స్‌లో పోటీ పడటం లేదు.
ఫెడరేషన్ కప్‌లో నిరాశపరిచి రెండో స్థానంలో నిలిచిన నేషనల్ రికార్డ్ హోల్డర్ షాట్‌పుట్ ప్లేయర్ తజీందర్‌పాల్ సింగ్ తూర్ ఈ సారి జట్టులో లేడు. అయితే, విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న అవినాష్ సాబ్లే (3000 మీ. స్టీపుల్‌ఛేజ్), పరుల్ చౌదరి (విమెన్స్ 3000 మీ.స్టీపుల్‌ఛేజ్), గుల్వీర్ సింగ్ (5000, 10000 మీ) తదితరులు జట్టులో చోటు సంపాదించారు. కాగా, బ్యాంకాక్‌లో జరిగిన గత ఎడిషన్ ఆసియా అథ్లెటిక్స్‌లో ఇండియా ఆరు గోల్డ్ సహా 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి పతకాల సంఖ్యను మరింతగా పెంచాలని ఏఎఫ్‌ఐ ఆశిస్తోంది.