
న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మయామి ఓపెన్‌లో విజయంతో అరంగేట్రం చేశాడు. ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన నాగల్ మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వాలిఫయర్ తొలి రౌండ్‌లో 7–6 (3), 6–2తో వరుస సెట్లలో కెనడాకు చెందిన గాబ్రియెల్ డయల్లోపై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్‌లో నెగ్గిన 26 ఏండ్ల నాగల్.. రెండో రౌండ్‌లో జోరు చూపెట్టాడు. తొలి, ఏడో గేమ్స్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఈజీగా సెట్‌తో పాటు మ్యాచ్ నెగ్గాడు.