T20 World Cup 2024: పసికూనలే ప్రత్యర్థులు.. సూపర్ 8 లో భారత్ తలపడబోయే జట్లు ఇవేనా?

T20 World Cup 2024: పసికూనలే ప్రత్యర్థులు.. సూపర్ 8 లో భారత్ తలపడబోయే జట్లు ఇవేనా?

వరల్డ్ కప్ 2024లో భారత్ సూపర్ 8 కు చేరుకుంది. వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్ టేబుల్ టాప్ స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. ఐర్లాండ్, పాకిస్థాన్ పై నెగ్గిన భారత్.. నిన్న (జూన్ 12) అమెరికాపై విజయం సాధించింది. ఇదే గ్రూప్ లో పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా మరో బెర్త్ కోసం పోటీపడనున్నాయి. గ్రూప్ దశలో ప్రస్తుతం భారత్ కు కెనాడతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయినా టీమిండియా టేబుల్ టాపర్ గా ఉండడం దాదాపు ఖాయం. దీంతో ఇప్పుడు భారత్ సూపర్ 8 పై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. 

సూపర్ 8 లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్?

భారత్ జూన్ 24 న ఆస్ట్రేలియాతో సూపర్ 8 మ్యాచ్ ఆడడటం ఖాయమైంది. మరో రెండు మ్యాచ్ లు ఎవరో తేలాల్సి ఉంది. గ్రూప్ డి లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది. ఈ గ్రూప్ లో సౌతాఫ్రికా టాప్ లో ఉంది. శ్రీలంక ఇప్పటికే ఇంటిదారి పట్టడంతో రెండో స్థానంలో బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లలో ఒకటి భారత్ పై ఆడనుంది. జూన్ 22 న ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు గ్రూప్ సి లో టేబుల్ టాపర్ తో భారత్ తలపడనుంది. ఆఫ్ఘనిస్తాన్ లేదా వెస్టిండీస్ జట్లు భారత్ తో తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఉన్న ఫామ్ చూస్తుంటే భారత్ పై ఆడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. జూన్ 20 న ఈ మ్యాచ్ జరుగుతుంది. 

ఈ టోర్నీలో ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, వెస్టిండీస్ జట్లు అధికారికంగా సూపర్ 8 కు అర్హత సాధించగా.. ఒమన్, నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మరో 6 రోజుల్లో మ్యాచ్ లన్ని ముగుస్తాయి. టాప్ జట్లు ఇంగ్లాండ్, పాకిస్థాన్, న్యూజీలాండ్ డేంజర్ జోన్ లో ఉన్నాయి. స్కాట్లాండ్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8 చేరుకునే అవకాశం కనిపిస్తుంది.