
అండర్ -19 వరల్డ్ కప్ లో భారత్ బోణి కొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లతో ఏడు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 167 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్(76), ఉదయ్ సహారన్(64) అద్భుతమైన స్కోర్ దిశగా జట్టును నడిపించగా.. శౌమి పాండే4, ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీసి సత్తా చాటారు. దీంతో టీమీండియా.. బంగ్లాదేశ్ పై ఈజీగా గెలిచింది.