రాజ్‌గిర్ (బీహార్) : విమెన్స్ హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో గోల్స్ వర్షం కురిపించిన ఇండియా హ్యాట్రిక్ విజయం సాధించింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యంగ్ స్ట్రయికర్ దీపిక ఐదు గోల్స్‌తో విజృంభించడంతో డిఫెండింగ్ చాంప్ ఇండియా 13–0తో చిన్న జట్టు థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. ఏకపక్ష మ్యాచ్‌లో దీపిక సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. 3, 19, 43 నిమిషాల్లో గోల్స్ చేసిన ఆమె 45వ నిమిషంలో మరో రెండు గోల్స్ కొట్టింది.
ప్రీతి దూబే (9, 40వ ని), లాల్రెమ్సియామి (12, 56 వ ని), మనీషా చౌహాన్ (55, 58వ ని) డబుల్స్ గోల్స్‌తో సత్తా చాటగా.. డుంగ్ (30వ ని), నవనీత్ కౌర్ (53వ ని) ఒక్కో గోల్ చేశారు. మరో మ్యాచ్‌ల్లో మలేసియా 2–1తో కొరియాను, చైనా 2–1తో జపాన్ను ఓడించాయి. శనివారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో ఇండియా ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ చైనాతో పోటీపడనుంది.