ఈ ఏడాదే జపాన్‎ను​దాటేస్తాం.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా

 ఈ ఏడాదే జపాన్‎ను​దాటేస్తాం.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా

న్యూఢిల్లీ: మనదేశం ఈ ఏడాదే జపాన్‌‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్​(ఐఎంఎఫ్​) వెల్లడించింది. 2028 నాటికి జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డులకు ఎక్కుతుందని తెలిపింది. ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్‌‌లుక్ ప్రకారం.. భారతదేశం రాబోయే రెండేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. మన ఆర్థిక వ్యవస్థ 2025లో 6.2 శాతం, 2026లో 6.3 శాతం వృద్ధి చెందవచ్చు. 

ప్రాంతీయ దేశాల కంటే ఈ గ్రోత్​ఎక్కువ. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2025లో 2.8 శాతం,  2026లో 3.0 శాతమే ఉంటుంది.  టారిఫ్ యుద్ధం కారణంగా 2025కి జపాన్ వృద్ధి తగ్గుతుంది. జనవరిలో అంచనా వేసిన 1.1శాతం నుంచి 0.6శాతానికి ఈ దేశ వృద్ధి తగ్గవచ్చు. జపాన్ ఆర్థిక పనితీరుపై యూఎస్​ సుంకాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఈ నెల రెండో తేదీన డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‎లు వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేశాయి.  మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. చైనా తప్ప అన్ని దేశాలపై కొత్త సుంకాల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించడంతో కాస్త కుదుటపడ్డాయి. చైనా కూడా యూఎస్‎పై సుంకాలను పెంచింది. 

సవాళ్లున్నా ఇండియా ఎకానమీ ముందుకే: ఈవై

గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో ఇండియాలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయని, ఫలితంగా జీడీపీ గ్రోత్ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 6.5 శాతంగా నమోదవుతుందని ఫైనాన్షియల్ సంస్థ ఈవై ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంచనా వేసింది. ఎగుమతుల తగ్గుదల, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగమనం, క్రూడ్ ఆయిల్ ధరల పతనం, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉత్పత్తి పెరగడం వంటి నాలుగు అంశాలు ఇండియా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిపింది. 

“సరైన ఆర్థిక, ద్రవ్య విధానాలతో, రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 4 శాతం లోపు ఉంచుతూనే, ఇండియా జీడీపీ మీడియం టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6.5 శాతం వృద్ధి చెందగలుగుతుంది” అని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాత్సవ తెలిపారు. ఈవై రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 60-–65 డాలర్ల రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుందని అంచనా. క్రూడ్ ధరలు తక్కువగా ఉండడంతో ఇండియాకు మేలు జరుగుతుంది. అధిక టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  గ్లోబల్ డిమాండ్ పడిపోవడంతో ఎగుమతులు మందగించవచ్చు.

ఈ ప్రభావం జీడీపీపై పెద్దగా ఉండదు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఇండియా వృద్ధి పరిమితంగా ఉండొచ్చు.  కానీ,  ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బలంగా ఉండడంతో  స్టిమ్యులస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందివ్వడానికి వీలుంటుంది.  చివరిగా చైనా వంటి ప్రధాన ఎగుమతి దేశాలలో ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డిమాండ్ పడిపోవడంతో ఇండియాలోకి దిగుమతులు పెరగొచ్చు. వీటిని తగ్గించడానికి యాంటీ డంపింగ్ విధానాలను ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది.

ఆర్థిక వృద్ధి 6.7 శాతం..

గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇండియా జీడీపీ  6.5 శాతం వృద్ధి చెందిందని ఈవై అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6.2–6.7 శాతం రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుందని పేర్కొంది. ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ (ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 6.2 శాతం పెరుగుతుందని పేర్కొనగా, ప్రపంచ బ్యాంక్  6.3 శాతం గ్రోత్ నమోదవుతుందని తెలిపింది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండూ  6.5 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదవుతుందని అంచనా వేశాయి. జీడీపీ 6.4 శాతం వృద్ధి చెందుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది.