మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం (డిసెంబర్ 28) ఉదయం ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. శని వారం ఉదయం 9.30గంటలకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 11.45 గంటలకు నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటికలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కేంద్ర హోంశాఖ కోరింది.
స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి మల్లికార్జున్ ఖర్గే లేఖ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక ఘాట్ నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని కోరారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు స్మారక స్థలం ఏర్పాటు పై శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తో ఫోన్ లో మాట్లాడారు.. అనంతరం స్మారక ఘాట్ నిర్మాణంపై రెండు పేజీల లేఖను ప్రధానికి పంపారు.
ALSO READ | Punjab Bandh:డిసెంబర్ 30న పంజాబ్ బంద్..ఆందోళన చేస్తున్న రైతు సంఘాల పిలుపు
మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వలాంఛనాలతో జరిపించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. జనవరి 1 నుంచి ఏడు రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ జెండాను సగం మాస్ట్ లో ఎగుర వేయనున్నారు. శనివారం అన్నికేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.