అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్ సీక్ AI మోడల్ తరహాలోనే.. ఇండియా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI యాప్ తయారీకి రెడీ అయ్యింది. రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే విధంగా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. ప్రపంచ దేశాల కంటే చాలా ఆలస్యంగా మేల్కొన్న ఇండియా.. చైనా డీప్ సీక్ ఏఐ తయారీ తర్వాత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో.. ఫండింగ్తో ఇండియా AI తయారీకి ఆయా కంపెనీలతో డీల్స్ చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. AI దిశగా వేగంగా అడుగులు వేయటమే కాకుండా.. భారతీయ సంస్కృతి, సంప్రదా యా లు, భారతీయ మూలాలు, పర్యావరణం వంటి సామాజిక అంశాలను దృష్టి పెట్టుకుని..ఇండియా AI తయారు అవుతుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ వెల్లడించారు.
Also Read : BE/BTech అర్హతతో NTPCలో ఉద్యోగాలు
ఇండియా AI గురించి ఉత్కర్ష్ ఒడిషా కాన్‌క్లేవ్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బలమైన AI పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కంప్యూట్ సదుపాయం చాలా ముఖ్యమైన భాగం.. ఆరు నుంచిఎనిమిది నెలల్లో AI మోడల్‌లను అభివృద్ధి చేయగల కనీసం ఆరుగురు ప్రధాన డెవలపర్‌లు సిద్ధంగా ఉన్నారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అభివృద్ధికి18వేల693 GPUలను సమీకరించింది. ఇండియా AI కంప్యూట్ ఫెసిలిటీ ద్వారా అందించబడుతుందని తెలిపారు.
పరిశోధకులు, స్టార్టప్‌లు ,విద్యాసంస్థలు AI అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి లేటెస్ట్ మౌలిక సదుపాయాలు అవసరమమన్నారు అశ్వినీ వైష్ణవ్. AI మిషన్‌లో భాగంగా ప్రభుత్వం భాగస్వామ్య కంప్యూటింగ్ వనరులను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యతనిచ్చిందన్నారు.
AI మోడల్ తయారీకి కావాల్సిన కంప్యూటింగ్ లను భారత్ సమకూర్చుకుంది..వాస్తవానికి 10వేల GPU లను కొనుగోలు చేయాలని అంచనా మించి 19వేల GPU లను స్టోర్ చేసింది. అమెరికాకు చెందిన Nvidia కంపెనీ నుంచి దాదాపు 14వేల GPU కొనుగోలు చేసింది. ఇందులో 12వేల 896 Nvidia H100 GPU లు, 1480Nvidia H200 GPU లుఉన్నాయి. వీటిలో దాదాపు 10,000 GPUలు తక్షణ ఉపయోగం కోసం సిద్ధంగా ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.