ఈ నెల 31తో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత!

దేశంలో కరోనా కేసులు తగ్గటంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ నెల 31తో ప్రస్తుతం ఉన్న కొవిడ్ ఆంక్షలన్నీ ముగియనున్నాయి. దాంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వైరస్ నియంత్రణకు వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద మార్గదర్శకాలు విడుదలచేశారు. ఇప్పుడు ఆ నిబంధనలను పూర్తిగా ఎత్తేయనున్నట్లు ప్రకటించారు. కాగా..  ప్రజలంతా మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ.. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. వైరస్ నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒకవేళ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరిగితే.. స్థానిక ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చని కేంద్ర హౌంశాఖ తెలిపింది.

For More News..

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు 14 శాతం పెంపు

పాదయాత్రలో షర్మిలపై తేనెటీగల దాడి