టీ20 ప్రపంచ కప్ కు ముందు జరిగే సన్నాహక మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. మే 27 నుంచి జూన్ 1 మధ్య ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడంతో ఇంగ్లాండ్, పాకిస్తాన్ మినహా అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. దక్షిణాఫ్రికా జట్టు తమ ఆటగాళ్లతో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడనుండగా.. దీనితో కలిపి మొత్తం 17 జట్లు వార్మప్ గేమ్‌లు ఆడనున్నాయి.
భారత ప్లేయర్లు ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉండడం వల్లే ఒకే ఒక వార్మప్ మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ చేశారు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు.. జూన్ 1న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ సన్నాహక మ్యాచ్‌ల్లో ఒక్కో జట్టుకు 20 ఓవర్లు ఉంటాయి. అయితే వీటికి అంతర్జాతీయ టీ20 హోదా ఉండదు కనుక జట్లు తమ 15 ఆటగాళ్లను పరీక్షించుకోవచ్చు. జట్టులోని సభ్యులందరినీ ఫీల్డింగ్/ బ్యాటింగ్ చేయడానికి అనుమతిస్తాయి.
27 మే (సోమవారం):
- కెనడా vs నేపాల్
- ఒమన్ vs పపువా న్యూ గినియా
- నమీబియా vs ఉగాండా
మే 28 (మంగళవారం):
- శ్రీలంక vs నెదర్లాండ్స్
- బంగ్లాదేశ్ vs అమెరికా
- ఆస్ట్రేలియా vs నమీబియా
29 మే (బుధవారం):
- దక్షిణాఫ్రికా ఇంట్రా-స్క్వాడ్
- ఆఫ్ఘనిస్తాన్ vs ఒమన్
మే 30 (గురువారం):
- నేపాల్ vs అమెరికా
- స్కాట్లాండ్ vs ఉగాండా
- నెదర్లాండ్స్ vs కెనడా
- నమీబియా vs పాపువా న్యూ గినియా
- వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా
31 మే (శుక్రవారం):
- ఐర్లాండ్ vs శ్రీలంక
- స్కాట్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్
1 జూన్ (శనివారం):
- బంగ్లాదేశ్ vs ఇండియా (వేదిక ఖరారు కాలేదు)
టీ20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీ కోసం శ్రీలంక జట్టు ఇప్పటికే అమెరికా చేరుకుంది. అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే లంక క్రికెట్ బోర్డు.. తమ ఆటగాళ్లను దాదాపు 20 రోజుల ముందే అక్కడికి పంపింది. అయితే ఈ విషయంలో బీసీసీఐ వైఖరి మాత్రం మరోలా ఉంది. వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన ప్లేయర్లందరూ ఐపీఎల్ మ్యాచులతో బిజీగా ఉండటంతో రెండు గ్రూపులుగా అమెరికా పంపనుంది. మే 22న ఓ బ్యాచ్ యూఎస్ బయలుదేరి వెళ్లనుండగా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిశాక మరో బ్యాచ్ వెళ్లనుంది.