తొలి ఆడియో విజువల్​ ఎంటర్​టైన్​మెంట్​ సమ్మిట్​

తొలి ఆడియో విజువల్​ ఎంటర్​టైన్​మెంట్​ సమ్మిట్​

వరల్డ్​ ఆడియో విజువల్​ ఎంటర్​టైన్​మెంట్​ సమ్మిట్​(వేవ్స్​)ను ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు మొదటిసారి నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వేవ్స్​ సమ్మిట్ భారతదేశ సృజనాత్మక ప్రతిభకు ప్రపంచ వేదికగా నిలవనున్నది. 

సదస్సు ముఖ్యోద్దేశం

  • భారత సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడం, 
  • ఈ రంగంలో పెట్టుబడిదారులను భారత్​కు తీసుకురావడం, వీడియో గేమింగ్, వినోదరంగానికి భారత్​ను హబ్​గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్​ నిర్వహించనున్నది. 
  • ఈ సదస్సు మొత్తం మీడియా, వినోద రంగాలకు అతిపెద్ద అనుసంధాన కార్యక్రమం అవుతుంది.
  •  ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు సమావేశమయ్యే దావోస్​ తదితర ప్రపంచ ఆర్థిక సదస్సుతో వేవ్స్​ సమ్మిట్​ను ప్రధాని మోదీ పోల్చారు.