భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరగనుంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 న పెర్త్ లో ముగిసిన తొలి టెస్ట్ ముగిసిన తర్వాత అడిలైడ్ ఓవల్‌లో డే-నైట్ టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు భారత క్రికెట్ జట్టు కాన్‌బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల పింక్-బాల్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో మనుకా ఓవల్‌లో డే-నైట్ ప్రాక్టీస్-గేమ్ జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా తన ప్రకటనలో తెలిపింది. అడిలైడ్ లో డే-నైట్ టెస్ట్‌కు ముందు పింక్ కూకబుర్రా బంతితో ప్రాక్టీస్ ఆడేందుకు భారత్‌కు అవకాశాన్ని కల్పిస్తుంది. అడిలైడ్ ఓవల్‌లో డిసెంబర్ 6న రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. 1991–92 తర్వాత తొలిసారి ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. 1991 తర్వాత నాలుగు టెస్ట్‌ల సిరీస్‌గానే నిర్వహించేవారు.
సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.
ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 సైకిల్ లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
India will play a two-day pink-ball warm-up match ahead of the Adelaide Test 📅
— ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2024
Full story 👉 https://t.co/d6m9K1LKU6 #AUSvIND pic.twitter.com/s9xH4nzrBQ