రేపట్నుంచి 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్

భారత్ వ్యాప్తంగా ఇప్పుడు మరో కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ సారి ఈ కొత్త టీకా 12-14 సంవత్సరాల పిల్లలకు వేయనున్నారు. రేపట్నుంచి ఈ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. అయితే పిల్లలకు కార్బెవాక్స్ వ్యాక్సిన్ మాత్రమే వేయనున్నారు.ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషన్ ఆదేశాలు పంపారు. 12 నుంచి 13, 13 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఒక్క కార్బెవాక్స్ టీకా మాత్రమే ఇవ్వాలన్నారు. 

కోవిడ్ వైరస్‌కు వ్యతిరేకంగా తయారు చేయబడిన కార్పోవ్యాక్స్ టీకా మూడోవ వ్యాక్సిన్‌గా చేర్చబడింది. ఇది పూర్తిగా ఉచిత టీకా.   అందుబాటులో ఉన్న అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంటుందని భూషణ్ తెలిపారు. అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో కార్పోవ్యాక్స్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు భూషన్. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే.

దీంతో పాటు ఇకపై 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ప్రికాషన్‌ డోసులో ‘ఇతర అనారోగ్య సమస్య’ల క్లాజ్‌ను తొలగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. మార్చి 16వ తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నట్లు హెల్త్ సెక్రటరీ భూషణ్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడిన ఇతర అనారోగ్య సమస్యలున్న వృద్ధులకు కేంద్రం ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే.