International Energy Agency Report: ఏసీలకు ఇంత కరెంట్ వాడుతున్నామా.! ఒక దేశం మొత్తం వాడే విద్యుత్ కంటే ఎక్కువ!

International Energy Agency Report: ఏసీలకు ఇంత కరెంట్ వాడుతున్నామా.! ఒక దేశం మొత్తం వాడే విద్యుత్ కంటే ఎక్కువ!

మన దేశంలో ఎయిర్ కండిషనర్ల వాడకంపై షాకింగ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(IEA).రాబోయే దశాబ్ధంలో ఎయిర్ కండిషనర్ల స్టాక్ 4.5 రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది.ఫలితంగా 2035 నాటికి ఎయిర్ కండిషనర్ల నుంచి విద్యుత్ డిమాండ్ ఒక సంవత్సరం మెక్సికో దేశం మొత్తం వాడే విద్యుత్ వినియోగం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

IEA రిపోర్టు ప్రకారం.. భారత దేశంలో విద్యుత్ వినియోగం 2023లో 45.4 ఎక్సాజౌళ్లు ఉండగా.. 2025లో 60.7 ఎక్సాజౌళ్ళు కు పెరిగింది. 2030నాటకి 70.5 ఎక్సాజౌళ్లు అంచనా వేసింది. దీంతోపాటు చమురు డిమాండ్ కూడా భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. రోజుకు 5.2 మిలియన్ బ్యారెల్స్ నుంచి 2035 నాటికి 7.1మిలియన్ బీపీడీకి పెరుగుతోంది. శుద్ది కర్మాకారాలలో ముడి చమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా 5.8 మిలియన్ బీపీడీ నుంచి 7.1 మిలియన్ బీపీడీలకు పెరుగుతుంది. 

ఇక సహజ వాయివుకు విషాయానికి వస్తే.. 2050 నాటికి64 బిలియన్ క్యూబిక్ మీటర్ల నుంచి 172 బీసీఎం లకు పెరుగుతుంది. బొగ్గు ఉత్పత్తి 2023లో 721 మిలియన్ టన్నులు ఉండగా.. 2050 నాటికి 645 మిలియన్ టన్నులకు పెరగనుంది. 

Also Read:-మన ఎగుమతులు కొద్దిగా పెరిగాయ్..వాణిజ్య లోటు తగ్గింది