న్యూఢిల్లీ: డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో మనదేశం ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఎదిగింది. ఈ విషయంలో టాప్–4 దేశాలను అధిగమించింది. మైగవ్ఇండియా నుంచి సేకరించిన డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ చెల్లింపులలో భారతదేశం ఏకంగా 46 శాతం వాటాను సాధించింది. డిజిటల్ చెల్లింపు రంగంలో స్పష్టమైన ఆధిపత్యాన్ని దక్కించుకుంది. మనదేశంలో జరిగినన్ని లావాదేవీలు మరే దేశంలోనూ జరగలేదు. 29.2 మిలియన్ల లావాదేవీలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, 17.6 మిలియన్ల లావాదేవీలతో చైనా మూడో స్థానంలో నిలిచింది. మైగవ్ఇండియా అందించిన డేటా ప్రకారం, థాయిలాండ్ 16.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో నాలుగో స్థానాన్ని పొందగా, దక్షిణ కొరియా 8 మిలియన్ల విలువైన లావాదేవీలను నమోదు చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. మైగవ్ఇండియా అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్లాట్‌ఫారమ్. దేశవ్యాప్తంగా టెక్నాలజీల వాడకాన్ని పెంచడానికి కార్యక్రమాలు చేపడుతుంది. డిజిటల్ చెల్లింపులలో భారతదేశం మొదటిస్థానంలో ఉందని, దీనివల్ల దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మెచ్చుకున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మొదటి స్థానంలో ఉండటానికి మనదేశంలో మొబైల్ డేటా అత్యంత చౌకగా లభించడం కూడా కారణమని చెప్పారు. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పర్టుల అభిప్రాయం ప్రకారం, భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగం విలువ, పరిమాణం... రెండింటిలోనూ గణనీయమైన మైలురాళ్లను సాధిస్తోంది. దేశ పేమెంట్స్ ఎకోసిస్టమ్ బలోపేతం అవుతోంది.
ఆన్లైన్ పేమెంట్స్‌లో అదరగొట్టాం!.. మనదేశంలో రికార్డు స్థాయిలో ట్రాన్సాక్షన్లు
- బిజినెస్
- June 11, 2023
లేటెస్ట్
- అరెస్ట్ కావాలని కేటీఆర్‌కు చాలా ఇంట్రెస్ట్: ఎంపీ చామల
- కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్: అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లపై నిరసనగా భారీ ర్యాలీ
- Theatre Releases: క్రిస్మస్కు థియేటర్లలో సినిమాల సందడి.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!
- బరితెగించేశారు : ఇంట్లోకి వచ్చి మరీ.. కళ్లల్లో కారం కొట్టి.. బంగారం దోచుకెళ్లారు
- అమిత్ షా సిగ్గు లేకుండా, మతితప్పి మాట్లాడారు.. హోంమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- IND vs AUS 3rd Test: తప్పు చేసి సారీ చెప్పాడు: హెడ్‌కు ఆకాష్ దీప్ క్షమాపణలు
- హైదరాబాద్ లో టీస్టాల్ ముసుగులో గంజాయి చాక్లెట్లు.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- కలియుగ దైవం : మహా కుంభమేళాలో.. తిరుమల వెంకన్న నమూనా ఆలయం
- మామ చాటు అల్లుడిగా హరీష్ రావు రూ.10 వేల కోట్లు దోచుకుండు: మంత్రి కోమటిరెడ్డి
- ఆధ్యాత్మికం : ధనుర్మాసం పురాణ కథ ఏంటీ.. వైకుంఠ ఏకాదశి ముక్తిని ప్రసాదిస్తుందా..? ఉత్తర దిక్కు దేనికి ప్రతీక
Most Read News
- IND vs AUS 3rd Test: ఆకాష్ దీప్ ఫోర్.. పట్టరాని సంతోషంతో గంభీర్, రోహిత్, కోహ్లీ సంబరాలు
- ఏపీ డిప్యూటీ సీఎంకు భారీ షాక్: షిప్ సీజ్ చేయటం సాధ్యం కాదన్న కలెక్టర్
- లోన్ యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్నాడు.. లక్షా 20వేలు తిరిగి కట్టాడు.. అయినా సరే వదల్లేదు!
- సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- లోక్‌సభలో జమిలి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
- ఎక్స్‌ఫైరీ వస్తువులు అమ్ముతున్న రిలయన్స్ సిబ్బంది.. కస్టమర్ల ఆందోళన
- అల్లు అర్జున్ బెయిల్‌పై అప్పీల్.. బన్నీకి బిగ్ షాక్ తప్పదా..?
- మ్యూచువల్ ఫండ్ రూల్స్‌లో మార్పులు
- IND vs AUS 3rd Test: డ్రా దిశగా గబ్బా టెస్ట్.. టీమిండియాను కాపాడిన ఆకాష్ దీప్, బుమ్రా
- కూర్చొకపోతే సస్పెండ్ చేస్తా.. కేటీఆర్, కౌశిక్ రెడ్డికి స్పీకర్ వార్నింగ్