IND vs ENG 2025: ఇంగ్లాండ్‌తో భారత్ టెస్ట్ సిరీస్.. పూర్తి షెడ్యూల్ ప్రకటన

భారత్, ఇంగ్లాండ్ జట్లు 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. జూన్ 20 నుండి ఆగస్టు 4 వరకు జరగనున్న ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ ఆతిధ్యమివ్వబోతుంది. మ్యాచ్‌లు, వేదికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం (ఆగస్టు 22) ప్రకటించింది. భారత్ తో సిరీస్ తో పాటు తమ సొంత గడ్డపై జరిగే సమ్మర్ షెడ్యూల్‌ మొత్తాన్ని రిలీజ్ చేసింది. భారత్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తో ఇంగ్లాండ్ తమ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-2027 సైకిల్‌ను ప్రారంభించనుంది.

ALSO READ | ICC Rankings: టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్.. టాప్‌లోనే భారత ఆటగాళ్లు

లీడ్స్‌లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ గౌల్డ్ ఆశిస్తున్నాడు. 

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్