IND vs SL 2024: శ్రీలంక టూర్‌కు భారత్.. పూర్తి షెడ్యూల్ ప్రకటన

IND vs SL 2024: శ్రీలంక టూర్‌కు భారత్.. పూర్తి షెడ్యూల్ ప్రకటన

ప్రస్తుతం భారత్ టీ20 వరల్డ్ కప్ ఆడుతూ బిజీగా ఉంది. ఈ మెగా టోర్నీ తర్వాత వరుసగా జింబాబ్వే, శ్రీలంకలో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జింబాబ్వే పర్యటనకు షెడ్యూల్ ను, జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. సీనియర్లకు రెస్ట్ తీసుకోవడంతో యువ భారత జట్టుకు శుభమాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. తాజాగా ఈ సిరీస్ తర్వాత జరగబోయే శ్రీలంక సిరీస్ కు షెడ్యూల్ వచ్చేసింది. ఈ టూర్ లో భారత్ 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. 

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్‌, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలోనూ బీసీసీఐ సీనియర్లకు రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఐపీఎల్ లో సత్తా చాటిన యువ క్రికెటర్లకు ఈ టోర్నీ మరోసారి నిరూపించుకునేందుకు మంచి అవకాశం. 

ఇండియా శ్రీలంక టీ20, వన్డే షెడ్యూల్: 

టీ20 సిరీస్  

• 1వ టీ20  – 27 జూలై 

• 2వ టీ20 – 28 జూలై

• 3వ టీ20 – 30 జూలై 

వన్డే సిరీస్  

• 1వ వన్డే – 2 ఆగస్ట్ 

• 2వ వన్డే – 4 ఆగస్ట్ 

• 3వ వన్డే – ఆగస్ట్ 7 

భారత కాలమాన ప్రకారం టీ20 మ్యాచ్ లన్నీ సాయంత్రం 7:30 నిమిషాలకు.. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ ఆరు మ్యాచ్‌ల వేదికలను ప్రకటించాల్సి ఉంది. శ్రీలంక జట్టుకు వనిందు హసరంగా కెప్టెన్ గా కొనసాగుతాడు. మరో వైపు భారత కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. హార్దిక్ పాండ్య,  శుభమాన్ గిల్, రాహుల్ కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు.