ఇదే నెల(జులై)లో భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రారంభం కావాల్సిన ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జులై 26న ఈ ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కావాల్సిఉండగా.. ఒకరోజు వెనక్కి నెట్టబడ్డాయి. అనగా జులై 27న ఈ పర్యటన షురూ కానుంది. మొదటి నాలుగు గేమ్‌లకు ఈ సర్దుబాటు చేసింది.
సవరించిన షెడ్యూల్
- మొదటి టీ20: జులై 27 (పల్లకెలె)
- రెండో టీ20: జులై 28 (పల్లకెలె)
- మూడో టీ20: జులై 30 (పల్లకెలె)
- మొదటి వన్డే: ఆగష్టు 2 (కొలొంబో)
- రెండో వన్డే: ఆగష్టు 4 (కొలొంబో)
- మూడో వన్డే: ఆగష్టు 7 (కొలొంబో)
ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కేవలం రెండు స్టేడియాలకే పరిమితం చేశారు. టీ20 మ్యాచ్‌లన్నీ పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(పల్లెకెలె) వేదికగా జరగనుండగా.. వన్డే సిరీస్ కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియానికి పరిమితమైంది. భారత కాలమానం ప్రకారం, టీ20లు రాత్రి 7:30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
UPDATE 🚨
— BCCI (@BCCI) July 13, 2024
A look at the revised schedule for #TeamIndia's upcoming tour of Sri Lanka #SLvIND pic.twitter.com/HLoTTorOV7