బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలతో పాటు చివర్లో ఆకాష్ దీప్, బుమ్రా పట్టుదలతో భారత్ ఫాలో నుంచి బయటపడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. క్రీజ్ లో ఆకాష్ దీప్ (27), బుమ్రా (10) ఉన్నారు. ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయట పడ్డ భారత్.. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది. మరో రోజు మాత్రమే మ్యాచ్ మిగిలి ఉండడంతో ఈ టెస్ట్ డ్రా అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
నాలుగో రోజు మ్యాచ్ కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. ఆస్ట్రేలియా బౌలర్లకు ఇది చిరాకు తెప్పించింది. ఆట ఆరంభంలోనే రోహిత్ శర్మ ఒక చెత్త షాట్ ఆడి 10 పరుగుల వద్ద కమ్మిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో జడేజా, రాహుల్ 67 పరుగుల భాగస్వామ్యంతో భారత్ కోలుకుంది. రాహుల్ ఔటైనా జడేజా మరో ఎండ్ లో పోరాడాడు. రాహుల్ 84 పరుగులు చేయగా.. జడేజా 77 పరుగులు చేసి రాణించారు. వీరిద్దరూ మినహాయిస్తే మిగిలిన వారందరూ విఫలమయ్యారు.
Also Read:- రాహుల్ బ్యాడ్ లక్.. స్లిప్‌లో స్మిత్ స్టన్నింగ్ క్యాచ్..
చివర్లో జడేజా అవుట్ అయిన తర్వాత భారత్ ఫాలో ఆన్ ఆడడం ఖాయమనిపించింది. 9 వికెట్లు కోల్పోయిన తర్వాత ఆకాష్ దీప్, బుమ్రా ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నారు. చివరి వికెట్ కు అజేయంగా 39 పరుగులు జోడించి ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్ మూడు వికెట్లు తీసుకోగా.. లియాన్, హేజల్ వుడ్ లకు తలో వికెట్ దక్కింది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది.
Have India saved the Gabba Test?
— ESPNcricinfo (@ESPNcricinfo) December 17, 2024
An unbeaten 39*-run stand between Akash Deep and Jasprit Bumrah for the last wicket has ensured that Australia have to bat again ➡️ https://t.co/PupB4ooHCb #AUSvIND pic.twitter.com/FiHDjla1Qv