IND vs AUS 3rd Test: డ్రా కోసం పోరాడుతున్న భారత్.. ఆదుకున్న రాహుల్, జడేజా

IND vs AUS 3rd Test: డ్రా కోసం పోరాడుతున్న భారత్.. ఆదుకున్న రాహుల్, జడేజా

బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ డ్రా కోసం పోరాడుతుంది. నాలుగో రోజు తొలి సెషన్ లో ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా పట్టుదల చూపించడంతో తొలి సెషన్ ను ఘనంగా ముగించింది. నాలుగో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (41),నితీష్ కుమార్ రెడ్డి (7) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 278 పరుగుల దూరంలో వెనకబడి ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 78 పరుగులు చేయాల్సి ఉంది. 

4 వికెట్ల నష్టానికి 51 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ లో ప్రారంభించిన భారత్ ఆరంభంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. 10 పరుగులే చేసి కమ్మిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో భారత్ ఐదో వికెట్ కోల్పోవడంతో  ఫాలో ఆన్ ఆడుతుందేమో అనే అనుమానం కలిగింది. ఈ దశలో రాహుల్, జడేజా అద్భుతంగా ఆడారు. పట్టుదలతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 

ALSO READ : నేను గొప్ప బ్యాటర్‌ని.. నా రికార్డుల కోసం గూగుల్‌లో వెతుక్కో..: జస్ప్రీత్ బుమ్రా

ఆరో వికెట్ కు 67 పరుగులు జోడించిన తర్వాత 84 పరుగులు చేసిన రాహుల్ ను లియాన్ ఔట్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డితో జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్, స్టార్క్ రెండో వికెట్లు తీసుకున్నారు. లియాన్, హేజాల్ వుడ్ తలో వికెట్ పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ అందించారు.