IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఓటమి దిశగా టీమిండియా

IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఓటమి దిశగా టీమిండియా

అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమికి దగ్గరలో ఉంది. రెండో రోజు మొదట బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్ లో విఫలమైన మన జట్టు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ ఆతిధ్య జట్టు చేతిలోకి వెళ్ళిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 157 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ విజృంభించి 5 వికెట్లను పడగొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.    

ప్రస్తుతం భారత్ మరో 29 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో నితీష్ రెడ్డి (15), రిషబ్ పంత్ (28) ఉన్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఏ ఒక్కరు కూడా 30 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయారు. బోలాండ్, కమ్మిన్స్ రెండు వికెట్లు తీసుకోగా.. స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు. మూడో రోజు పంత్ నితీష్ రెడ్డి ఎంతవరకు పోరాడతారనే దాన్ని బట్టి మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. 157 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వస్తుంది. రాహుల్ (7), జైశ్వాల్ (24), కోహ్లీ (11), గిల్ (28), రోహిత్ శర్మ (6) విఫలమయ్యారు.              

ALSO READ : IND vs AUS: రోహిత్ శర్మ ఔట్.. అంతలోనే బతికి పోయిన హిట్‌మ్యాన్

అంతకముందు మొదటి రోజు ఆటలో తొలుత టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో 157 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ట్రావిస్ హెడ్(140) భారీ సెంచరీ చేయగా.. మార్నస్ లబుషేన్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో, ఆసీస్ 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ ద్యయం నాలుగేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, నితీష్ రెడ్డి చెరొక వికెట్ తీసుకున్నారు.