Asia Cup: సిక్సర్లతో శివాలెత్తిన 13 ఏళ్ళ కుర్రాడు.. ఆసియా కప్ సెమీ ఫైనల్లో భారత్

Asia Cup: సిక్సర్లతో శివాలెత్తిన 13 ఏళ్ళ కుర్రాడు.. ఆసియా కప్ సెమీ ఫైనల్లో భారత్

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ముగిసిన ఇటీవలే ఐపీఎల్ 2025 మెగా వేలంలో 13 ఏళ్లు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జాక్ పాట్ కొట్టాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ యువ క్రికెటర్‎ను రాజస్థాన్ రాయల్స్ కోటీ పది లక్షలకు దక్కించుకుంది. పదమూడేళ్ల చిచ్చర పిడుగు వైభవ్ వంశీ కోటి పది లక్షలకు అమ్ముడుపోవడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది. అతని గురించి అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు పెట్టారు. అయితే ఈ 13 ఏళ్ళ క్రికెటర్ సామర్ఘ్యంపై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు.

ALSO READ : Aryaman Vikram Birla: ఆస్తి విలువ రూ.70 వేల కోట్లు.. 22 ఏళ్లకే భారత క్రికెటర్ రిటైర్మెంట్

అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా బుధవారం (డిసెంబర్ 4) వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షార్జా వేదికగా యూఏఈపై జరిగిన ఈ మ్యాచ్ లో వన్డేల్లో టీ20 ఇన్నింగ్స్ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు.  వైభవ్ 46 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. 165 స్ట్రైక్ రేట్ తో అతను బ్యాటింగ్ చేయడం విశేషం. వైభవ్ తో పాటు మరో ఓపెనర్ ఆయుష్ మ్హత్రే 51 బంతుల్లో అజేయంగా 67 పరుగులు చేయడంతో భారత్ మరో 203 బంతులు మిగిలి ఉండగానే 138 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే ఆలౌటైంది. మీడియం పేసర్ యుధాజిత్ గుహా 7-0-15-3 అద్భుతమైన గణాంకాలతో ప్రత్యర్థి జట్టును కట్టి పడేశాడు. ఇండియన్ కోల్ట్స్ తరఫున చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు తీయగా, కేపీ కార్తికేయ, మ్హత్రే చెరో వికెట్ తీశారు. 35 పరుగులు చేసిన రాయాన్ ఖాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.