ఆకలిలో ప్రజలను విశ్వగురువు చేశారు.. మోదీపై కాంగ్రెస్ చీఫ్‌‌ ఖర్గే ఫైర్‌‌‌‌

ఆకలిలో ప్రజలను విశ్వగురువు చేశారు..  మోదీపై కాంగ్రెస్ చీఫ్‌‌ ఖర్గే ఫైర్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రజలను ఆకలితో ‘విశ్వగురువు’గా మార్చారని కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని ఆరోపించారు. రిటైల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌ పెరగడంతో పాటు గ్లోబల్‌‌ హంగర్‌‌‌‌ ఇండెక్స్‌‌లో ఇండియా స్థానం 105కి పెరిగిందని మంగళవారం ‘ఎక్స్‌‌’లో పేర్కొన్నారు.

ఆహార భద్రత కోసం పేదలకు రేషన్‌‌ అందించినా.. దేశ ప్రజలను ఆకలితో విశ్వగురువుగా మోదీ మార్చేశారని మండిపడ్డారు. సెప్టెంబర్‌‌‌‌లో రిటైల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌ 5.49 శాతంగా నమోదైందని, గత తొమ్మిది నెలలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువన్నారు. అలాగే, కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయని పేర్కొంటూ ఓ పిక్చర్‌‌‌‌ను ఆయన షేర్‌‌‌‌ చేశారు. గత పదిన్నరేండ్లలో పదిన్నర సెకన్లు కూడా ప్రధాని మోదీ దోపిడీని వీడిచిపెట్టలేదని విమర్శించారు. డైవర్షన్‌‌ పాలిటిక్స్ ఇకపై పనిచేయవని, కనీస అవసరాల  కోసం ప్రజలు ఓటు వేస్తారని పేర్కొన్నారు.