ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ నెంబర్లపై ఈ వారం మార్కెట్ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ నెంబర్లపై ఈ వారం  మార్కెట్ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ నెంబర్లు నిర్ణయించనున్నాయి. దీంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐల) కదలికలు, గ్లోబల్ ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ట్రేడర్లు ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు.  డాలర్ మారకంలో రూపాయి ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపనున్నాయి. ఈ నెల 12న యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా వెలువడనుండగా, అదే రోజు ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది. 

ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై  పావెల్ సంకేతాలు ఇవ్వొచ్చు. ఈ నెల 12న ఇండియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా కూడా విడుదల కానుంది. 13న యూకే జీడీపీ డేటా, 14న యూఎస్ రిటైల్ సేల్స్ డేటా వెలువడనున్నాయి. మరోవైపు ఐషర్ మోటార్స్, గ్రాసిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వొడాఫోన్ ఐడియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తమ డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ వారం ప్రకటించనున్నాయి. ఢిల్లీలో బీజేపీ గెలిచింది. ఈ ప్రభావం సోమవారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రేట్ల కోత, ఢిల్లీలో బీజేపీ గెలుపుతో  మార్కెట్ సెంటిమెంట్  నెమ్మదిగా మెరుగుపడుతుందని అంచనా వేశారు. కిందటి వారం సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 354 పాయింట్లు(0.45 శాతం), నిఫ్టీ 78 పాయింట్లు పెరిగింది.