
సిల్హెట్ (బంగ్లాదేశ్): బ్యాటింగ్‌లో హేమలత (37), స్మృతి మంధాన (33), హర్మన్ ప్రీత్ కౌర్ (30) చెలరేగడంతో.. గురువారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో ఇండియా విమెన్స్ టీమ్ 21 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 5–0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 156/5 స్కోరు చేసింది. మంధానాతో రెండో వికెట్‌కు 37 రన్స్ జోడించిన హేమలత.. హర్మన్‌తో మూడో వికెట్‌కు 60 రన్స్ జత చేసింది. చివర్లో రిచా ఘోష్ (28 నాటౌట్), దీప్తి శర్మ (5 నాటౌట్) ఆరో వికెట్‌కు 32 రన్స్ జోడించారు. రెబెయా ఖాన్, నహీదా అక్తర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 135/6 స్కోరుకే పరిమితమైంది. రితూ మోనీ (37) టాప్ స్కోరర్. షోరిఫా ఖాతున్ (28 నాటౌట్), రుబ్యా హైదర్ (20) ఫర్వాలేదనిపించారు. రాధా యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.