న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో తడబడి గట్టెక్కిన ఇండియా.. వరల్డ్ కప్‌లో రెండో పోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. కంగారూలపై 2 రన్స్‌కే 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడిన టీమిండియా ఈసారి అలాంటి సీన్‌ను రిపీట్ చేయొద్దని భావిస్తోంది. ఓపెనింగ్‌లో రోహిత్, ఇషాన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా భారీ స్కోరుపై కన్నేశారు. కోహ్లీకి హోమ్ గ్రౌండ్ కాగా, రాహుల్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం.
ఆల్‌రౌండర్లుగా హార్దిక్, జడేజా మెరిస్తే విజయం మరింత సులువుకానుంది. పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు స్పిన్నర్లతో ఆడే చాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అశ్విన్ ప్లేస్‌లో షమీ రావొచ్చు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిన అఫ్గాన్ సంచలనంపై దృష్టి పెట్టింది. అయితే ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ ఒక్కడే ఫామ్‌లో ఉండటం ప్రతికూలాంశం. మరోవైపు డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్లేట్‌లెట్స్ లక్షకు పడిపోవడంతో ఆదివారం అర్ధరాత్రి గిల్‌ను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.